ప్రాక్టీస్ చేస్తుండగా ఫ్యాన్స్ కేకలు.. కోహ్లీ రియాక్షన్ వైరల్

-

ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ ఫామ్ లో ఉన్నా లేకపోయినా తనకి ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విరాట్ కి కూడా తన ఫ్యాన్స్ అంటే బోలెడంత ఇష్టం. కొద్ది రోజులుగా ఫామ్ కోల్పోయిన విరాట్ ఇటీవలే మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ముఖ్యంగా నెలరోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత కోహ్లీ మరింత స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు. ఆసియా కప్ నుంచి రాణిస్తున్న కోహ్లీ.. పొట్టి ప్రపంచకప్‌లో ఎలాగైనా జట్టును గెలిపించాలని కసిగా ఉన్నాడు. దాని కోసం కఠోర సాధన చేస్తున్నాడు. రెండ్రోజుల్లో పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.

మామూలుగానే పాకిస్తాన్‌తో ఆడటాన్ని ఎంజాయ్ చేసే కోహ్లీ ఈ మ్యాచ్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఎంసీజీ మైదానంలో త్రో డౌన్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లి ప్రాక్టీస్ వీడియో తీస్తున్న ఓ ఫ్యాన్ ‘అవుట్ ఆఫ్ ది స్టేడియం’ అని అరిచాడు. అది విన్న కోహ్లీ చటుక్కున వెనక్కు తిరిగాడు. ‘యార్ ప్రాక్టీస్ కే టైం మే బోలో మత్, డిస్ట్రాక్షన్ హోతీ హై’ (ప్రాక్టీస్ టైంలో అలా అరవకండి. డిస్ట్రాక్ట్ అయిపోతాం) అని చెప్పాడు.

కోహ్లీ అలా చెప్పడంతో అర్థం చేసుకున్న ఫ్యాన్.. ‘జబ్ రిలాక్స్ హోంగే తబ బోలేంగే. కింగి కే లియో తో బోలేంగే హీ. కింగ్ హై వో’ (ఓకే రిలాక్స్ అయినప్పుడు అరుస్తాం. కింగ్ కోసం కచ్చితంగా అరుస్తాం.. ఆయన కింగ్) అని చెప్పడం వీడియోలో వినిపించింది. ఏదేమైనా కోహ్లీది మామూలు ఫాలోయింగ్ కాదుగా. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news