వైరల్ వీడియో: డ్రోన్‌ను ఎత్తుకెళ్లిన గ్రద్ద..!

-

ఫోటోలను ఫొజులు ఇచ్చేందుకు నానా పాట్లు పడేవాళ్లం. అలాంటిది డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక.. ఆ సమస్య తీరిపోయిందనే చెప్పుకోవచ్చు. డ్రోన్లు వాడుకలోకి వచ్చాక అత్యవసర పరిస్థితులకు ఎంతో ఉపయోగపడ్డాయి. మెడికల్ ఎమర్జెన్సీకి, పార్సల్స్ డెలివరీకి కొన్ని కంపెనీలు డ్రోన్లనే వాడుతున్నాయి. ఇంకొందరు డ్రోన్లను వీడియోలు తీయడానికి, ఆకాశంపై నుంచి భూ అందాలను చూసేందుకు, ఫోటోలు దిగేందుకు వాడుతున్నారు. అలా ఓ వ్యక్తి డ్రోన్‌ను గాలిలో ఎగురవేసి బీచ్ అందాలను వీక్షిస్తున్నాడు. అనుకోకుండా ఓ గ్రద్ద డ్రోన్‌ను ఎత్తుకెళ్లింది.

గ్రద్దలు నేలపై ఉండే చిన్న చిన్న జంతువులతోపాటు గాలిలో ఎగిరే పక్షులను సైతం విడిచిపెట్టవు. చిన్న జంతువులు గాలిలో గ్రద్ద కనిపించిందంటే చాలు పొదల్లోకి వెళ్లి తలదాచుకుంటాయి. గాలిలో ఎగిరే డ్రోన్‌ను పక్షి అనుకుందేమో.. ఓ గద్ద డ్రోన్‌ను ఎత్తుకెళ్లింది. బ్యూటెంగ్ బిడెన్ ట్విట్టర్ ఖాతాలో డ్రోన్‌ను ఎత్తుకెళ్తున్న గ్రద్ద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విహంగ వీక్షణ వీడియోలను బంధించాలంటే ఒకప్పుడు కెమెరా మెన్‌లు హెలికాప్టర్‌లో ప్రయాణించి చిత్రీకరించేవారు. ఆ తర్వాత టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చాక.. డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. పోలీసుల అనుమతితో ఎక్కడైనా డ్రోన్లను ఎగురవేసి మంచి లోకేషన్స్‌ను చిత్రీకరించవచ్చు. సముద్ర తీరాన వీడియోను చిత్రీకరిస్తున్నప్పుడు అనుకోకుండా గ్రద్ద డ్రోన్‌ను పట్టుకుని తన వెంట తీసుకెళ్తుంది. డ్రోన్‌ను ఒక్కసారిగా కుదుపు రావడంతో డ్రోన్ వైపు చూశాడు. అప్పటికే ఆ గ్రద్ద డ్రోన్‌ను దూరం వెళ్తూ కనిపించింది.

ఒకసారి వీడియోను పరిశీలించినట్లయితే.. సముద్రం ఒడ్డు నుంచి కొంచెం దూరంలో డ్రోన్ ఎగురుతూ ఉంటుంది. కొంచెం సేపటికే కుదుపులు వచ్చినట్లు డ్రోన్ కదులుతూ ఉంటుంది. తీరా కెమెరాలో గ్రద్ద రెక్కలు, తోక భాగం కనిపిస్తాయి. తీరానికి వచ్చేసరికి కెమెరాలో గ్రద్ద నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news