పొరపాట్లు చేయడానికి భయపడేవారు విజయాన్ని అందుకోలేరు..

-

జీవితంలో ఎవ్వరికీ పూలపాన్పు కాదు. ప్రతీ ఒక్కరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ కష్టాల్లో నుండి బయటపడి ముందుకు వెళ్ళాల్సిందే. ఐతే చాలా మంది అందులో నుండి బయటకి రాకపోవడానికి కారణం పొరపాట్లకి భయపడడమే. ఏదైనా మొదలెట్టేముందు దాని గురించి చాలా శోధించి, అది అలా అవుతుంది, ఇలా అవుతుంది అని భయపడి, తప్పులు చేయకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించి అనుకున్న పని చేయడమే మానేస్తారు. ఎక్కువ మంది నిరుపేదలుగా ఉండిపోవడానికి కారణం అదే. తప్పులు ఎవరు చేయరు. అందరూ మనుషులే. అందరూ నేర్చుకుంటున్నవాళ్ళే.

స్కూల్లో చెప్పినట్టు తప్పులే చేయకూడదని, జీవితంలోనూ అలాంటి జోలికి వెళ్ళకుండా ఉండడం వల్లనే ధనవంతులవకుండా పేదరికంలోనే మగ్గిపోతున్నారని వ్యక్తిత్వ వికాస నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఎవ్వరేపని చేసినా అందులో కొన్ని పొరపాట్లు జరగడం చాలా కామన్. పొరపాట్లు జరుగుతాయని చెప్పి, పనే మొదలు పెట్టకుండా ఉండడం ఎంతవరకూ సమంజసం అనేది ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఏ పనైనా మొదలు పెడితేనే అవుతుంది. మొదలు పెట్టకుండా పనులేవీ జరగవు. అందుకే పొరపాట్లు చేయాలి. పొరపాటే కొత్త రకంగా ఆలోచించడానికి తోడ్పడుతుంది. అదే కొత్త జీవితానికి దారి చూపిస్తుంది. నీలోంచి నిన్ను నీఖు కొత్తగా పరిచయం చేస్తుంది. నీకింతా తెలివి ఉందా అని నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తుంది. పొరపాట్లకి భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ విజయాన్ని అందుకోలేవు.

ప్రపంచలో విజయం సాధించిన వాళ్ళందరూ పొరపాట్లు చేసినవాళ్ళే. విజయం సాధించిన తర్వాత నేనేమీ తప్పులు చేయలేదు. ఒక్క తప్పు చేయకుండానే ఈ స్టేజికి వచ్చానని చెబుతే నమ్మకండి. పొరపాట్లు చేస్తేనే విజయం దక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news