వైరల్‌ అవుతున్న కోహ్లీ- అనుష్కల వీడియో…!

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సండే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన కోహ్లీ సేన 8 వికెట్ల నష్టంతో ఓడిపోయింది. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నప్పటికి ఆ మ్యాచ్‌ సమయంలో విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్కపై చూపిన ప్రేమ మాత్రం ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మ్యాచ్‌లో విరాట్‌ తన సహచరులతో మాట్లాడుతూ లాబీలో ఉన్న అనుష్క వైపు చూస్తూ తిన్నవా అంటూ చేతితో సైగ చేశాడు. దానికి అనుష్క అవును అన్నట్టు ఏదో చెబుతూ థమ్స్‌ అప్‌ సింబల్‌ చూపించారు. విరాట్‌ తన భార్య పట్ల చూపిస్తున్న ఆదరణ అభిమానుల ప్రశంసలు అందుకుంటుంది.