ఫ్యాక్ట్ చెక్: విరాట్ కోహ్లీ, అనుష్క వమిక ఫోటోని షేర్ చేయడంలో నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు విపరీతంగా వస్తున్నాయి. కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. తాజాగా ఒక ఫేక్ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు యాక్టర్ అనుష్క శర్మ కూతురు వమిక ఫోటోని షేర్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది.

పైగా ఆ ఫోటో కూడా వైరల్ గా మారింది. అయితే విరాట్ కోహ్లీ గతంలోనే సోషల్ మీడియా అంటే ఏంటో నా కూతురికి తెలిశాక అప్పుడు ఫోటోలు షేర్ చేయడం మంచిదని చెప్పారు. అయితే కొందరు మాత్రం కూతురు వమిక ఫోటోని షేర్ చేసినట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్అ అవుతోంది. యితే ఇందులో ఎంత నిజం అనేది చూస్తే… ఈ వార్త ఫేక్ అని తెలుస్తోంది విరాట్ కోహ్లీ తన కూతురు ఫోటోని షేర్ చేయలేదు అని తెలుస్తోంది. విరాట్ కోహ్లీలా ఉండే సుశోభన లహరి ఫోటో ఇది అని తెలుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం షేర్ చేయలేదు. ఇది ఒక ఫేక్ వార్త అని నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news