ఇంస్టా గ్రామ్ లో ఒక్క పోస్ట్ కు అన్ని కోట్లా … కోహ్లీనా మజాకా !

-

క్రికెటర్ లకు, సినిమా స్టార్స్ కు మరియు పొలిటిసియన్స్ కు ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా స్టార్ క్రికెటర్ లకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు.. అటువంటి స్టార్ స్టేటస్ ఉన్న వారిలో ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు. కోహ్లీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో సభ్యుడిగా ఉన్నాడు. కాగా ఇంస్టా గ్రామ్ లో కోహ్లీకి 256 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. కోహ్లీ కనుక ఒక్క ఇంస్టా గ్రామ్ లో ఒక్క పోస్ట్ పెడితే, దానిని ఈ ఫాలోయర్ లు అందరూ చూడడం, లైక్ చేయడం మరియు షేర్ చేయడం ద్వారా అతనికి రూ. 11 .45 కోట్ల రూపాయలు వస్తాయట. ఈ విషయాన్నీ క్రికెట్ వర్గాలు తెలియచేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ అథ్లెట్ లలో ఇంస్టా గ్రామ్ ద్వారా ఎక్కువగా సంపాదించే వారిలో కోహ్లీ మూడవ వాడని సమాచారం.

ఇక మొదటి స్థానంలో ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఒక్క పోస్ట్ చేస్తే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఇక ఆ తర్వాత స్థానంలో మరో ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి ఒక్క పోస్ట్ కు రూ. 21.5 కోట్లు ఆర్జిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news