భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఓ క్రేజీ ఫైట్. మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది! ఇరుదేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆ పోరుకు ఆసియా కప్ వంటి మెగా టోర్నీ వేదికగా అయితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. అలాంటి భారత్, పాకిస్తాన్ జట్టు ఇప్పుడు మరోసారి తలపడనున్నాయి.
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్టు 28న భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పైనే క్రికెట్ ప్రేమికుల కళ్ళు నిలిచాయి. ఆసియా కప్ పాత రికార్డును పరిశీలిస్తే, పాకిస్తాన్ జట్టుపై భారత్ పైచేయి భారీగా కనిపిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే ఇండియా, పాక్ ప్రాక్టీస్ ను కూడా మొదలు పెట్టాయి.
ఈ తరుణంలో.. గ్రౌండ్ లో ఓ ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అవును.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రాక్టీస్ చేస్తుండగా… అతని దగ్గరకు వెళ్లి.. విరాట్ కోహ్లీ కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కలిసిన అనంతరం.. విరాట్ కోహ్లీ పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో మాట్లాడారు.
The reunion everyone was waiting for!!!! #BabarAzam #ViratKohli #INDvPAK pic.twitter.com/1nCCSFYeY3
— Taif Rahman (@taif_twts) August 24, 2022