మేం అనుకున్న‌ది ద‌క్కించుకున్నాం.. ఐపీఎల్ వేలంపై విరాట్ కోహ్లి స్పంద‌న‌..

-

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఐపీఎల్ 2021 వేలం పాట‌లో ప‌లువురు ఆట‌గాళ్లు భారీ ధ‌ర ప‌లికిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కూడా అధిక ధ‌ర‌ల‌కు ప‌లువురు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అయితే ఆ వేలంపై, తాము ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల‌పై ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సంతృప్తి వ్య‌క్తం చేశాడు.

virat kohli said he is happy with team purchases in ipl 2021 auction

ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీ రూ.15 కోట్లు పెట్టి న్యూజిలాండ్ పేస‌ర్ కైలె జేమిస‌న్‌ను కొనుగోలు చేసింది. అలాగే రూ.4.8 కోట్ల‌తో ఆల్ రౌండ‌ర్ డాన్ క్రిస్టియ‌న్‌ను, రూ.14.25 కోట్ల‌తో మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. ఈ క్ర‌మంలో కోహ్లి వేలంలో తాము పొందిన ఆట‌గాళ్ల‌పై స్పందించాడు. తాము అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చే ఆట‌గాళ్ల‌నే కొన్నామ‌ని, త‌మ‌కు ఫ్యాన్స్ నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని తెలిపాడు. ఈ మేర‌కు ఆర్‌సీబీ ఓ వీడియోను షేర్ చేసింది.

కాగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆరోన్‌ఫించ్‌, క్రిస్ మోరిస్‌, ఉమేష్ యాద‌వ్ వంటి ఆట‌గాళ్ల‌ను రిలీజ్ చేయ‌గా.. వారిలో మోరిస్‌ను రూ.16.25 కోట్ల‌కు రాజ‌స్థాన్ కొనుగోలు చేసింది. ఇక ముంబై ఇండియ‌న్స్ అధిక సంఖ్య‌లో లోక‌ల్ ప్లేయ‌ర్ల‌ను తీసుకుంది. కానీ కోల్‌క‌తా, హైద‌రాబాద్ జ‌ట్లు లోక‌ల్ టాలెంట్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఆ టీమ్‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news