అనుష్క పోస్ట్ కి విరాట్ రియాక్షన్.. ఫ్యాన్స్ ఫిధా..!

-

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా విరాట్‌ కోహ్లీ తెలియజేశాడు. ప్రస్తుతం అనుష్క గర్భవతి అని.. ఇద్దరిగా ఉన్న తమ కుటుంబం త్వరలోనే ముగ్గురిగా మారబోతుందని చెప్పి.. అందుకు సంబంధించి ఒక ఫోటోను ఆగస్టు 27 న ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది చూసిన అభిమానులు వీరుష్కా జంటకు అభినందనలు తెలియజేశారు. అయితే తాజాగా.. అనుష్క శర్మ మరో ఫోటోను తన అభిమనులతో పంచుకుంది.

తన గర్భాన్ని చూస్తూ సంతోషపడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “మీలో జీవిత సృష్టిని అనుభవించడం కంటే మరేమీ నిజం కాదు. ఇది మీ నియంత్రణలో లేనప్పుడు నిజంగా ఏమిటిది?” అని ఫొటో కింద అనుష్క కాప్షన్‌ పెట్టారు. దీనిపై విరాట్‌ కోహ్లీ స్పందిస్తూ, “నా ప్రపంచం మొత్తం ఒకే ఫ్రేంలో ఉంది” అని రాసి హార్ట్ ఎమోజీని పొందుపర్చారు. దీంతో ఈ పోస్టుపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు అభిమానులు. ఇకపోతే 2017 డిసెంబర్​లో ఈ జంట వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news