చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు..విశాఖ కమిషనర్ వార్నింగ్ …!

-

విశాఖ న‌గ‌రంలో పలు చోరీ కేసులను పోలీసుల చేదించారు. 20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప‌లు కేసుల్లో మొత్తం 10 మంది దొంగ‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధ‌ర్భంగా పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడారు. దొంగతనాల పై నిఘా పెడుతున్నామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. రాత్రి పూట తిరుగుతున్న అనుమాన వ్యక్తుల వేలు ముద్రలు సేకరిస్తున్నామ‌ని చెప్పారు. సాంకేతికత‌ సహాయంతో ఎవరైనా గతంలో చోరీలు చేస్తే వారి వివరాలు తెలుస్తాయన్నారు. గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నామ‌ని చెప్పారు.

నగరంలో గంజాయి రవాణా చాలా తక్కువ అని ఆయ‌న అన్నారు. చిన్న చిన్న ప్యాకేట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని…రోజుకి రెండు, మూడు కేసులు నమోదు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పటి వరకు 226 మందికి గంజాయి వినియోగిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. గంజాయి వద్దు-చదువే ముద్దు అనే నినాదంతో అన్ని కాలేజీల‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. లిక్విడ్ గంజాయి డ్రగ్స్ మీద పూర్తి నిఘా ఉందని…చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news