నవంబర్ 17 తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వచ్చే నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరోనా నియమాలు పాటిస్తూఅసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

అదాని ఎంటర్ ప్రైజెస్ కు 130 ఎకరాలను విశాఖ మధురవాడలో కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపగా.. 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించింది. ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్ లకు ఆమోదం తెలిపిన కేబినెట్.. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రై పాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు వీలుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలిపింది. విశాఖ మధురవాడలో శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపగా.. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశానికి ఆమోదం ముద్ర పడింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.