విశాఖలో నేడు విజయసాయి పాదయాత్ర.. సర్వత్రా ఉత్కంట !

Join Our Community
follow manalokam on social media

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయ సాయి రెడ్డి చేస్తున్న పాద యాత్ర ప్రారంభం కానుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో దాదాపు పాతిక కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు ఆయన. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనరేటు దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు విజయ సాయి రెడ్డి పాదయాత్ర జరగనుంది.

mp vijayasi reddy
mp vijayasi reddy

ఈ రోజు సాయంత్రం స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు వైసీపీ శ్రేణులు. విజయ్ సాయి రెడ్డి పాద యాత్రలో భారీ సంఖ్యలో కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగులలో ధైర్యాన్ని నింపడంతో పాటు విశాఖ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రచారంలా కూడా ఇది ఉంటుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...