కృతి శెట్టి మోజులో స్టార్ హీరో.. వామ్మో.. 3 కోట్ల పారితోష‌కం ఆఫ‌ర్‌

-

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ సరసన నటించి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన హావ భావాలతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కృత్తి శెట్టి.. ఆ తర్వాత ఏకంగా నాచురల్ స్టార్ నాని సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకుంది.

శ్యామ్ సింగారాయ్ సినిమాతో ఏకంగా బోల్డ్ బెడ్ సీన్ లో నటించడం .. లిప్ లాక్, దమ్ములాగడం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులలో కొంతవరకు నెగిటివిటీని దక్కించుకున్నప్పటికీ ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్లో నాగచైతన్యకు జోడీగా బంగార్రాజు సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి హాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక మరొకసారి నాగచైతన్య పట్టుబట్టి ఆమెను తన సినిమాలో నటించేలా చేస్తున్నాడు .

ఇదిలా ఉండగా మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటిస్తున్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” అనే సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇకపోతే తెలుగులో ఇన్ని సినిమాలలో నటిస్తుండగానే తమిళ్లో కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వచ్చి పడుతూ ఉండడం గమనార్హం.

ఇప్పటికే కోలీవుడ్ క్రియేటివ్ స్టార్ హీరో సూర్య సరసన ఒక సినిమాలో నటిస్తుండగానే మరొకసారి కోలీవుడ్లో విశాల్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నటించడానికి ఆమెకు కాల్ సీట్లు అడ్జస్ట్ కావడం లేదట.

కానీ విశాల్ కు నో చెప్పలేక ఇబ్బంది పడుతున్న కృతి శెట్టి నీ అర్థం చేసుకున్న విశాల్.. మీకు సమయం ఉన్నప్పుడే డేట్స్ ఇస్తే సరిపోతుందంటూ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడంట. అంతేకాదు అక్కడ కొద్దిరోజులు.. ఇక్కడ కొద్ది రోజులు షూటింగ్ అడ్జస్ట్ చేస్తానని చెప్పినా తమకేం పర్వాలేదంటూ కృతి శెట్టి కి ఆఫర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ వార్త బాగా వైరల్ గా మారుతుంది. దీన్ని బట్టి చూస్తే అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news