Vishwak Sen : ‘ధమ్కీ’ ఇచ్చేందుకు వచ్చేసిన విశ్వక్

-

సీనియర్ హీరో అర్జున్ , యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య రీసెంట్ గా జరిగిన వివాదం గురించి తెలిసిందే. దీనిపై తెర వెనుక చాలా విషయాలు జరిగాయని తెలుస్తోంది. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని అర్జున్, ఎప్పుడూ వివాదాలలో వుండే విశ్వక్ సేన్ మధ్య గొడవతో అందరి వేళ్ళు విస్వక్ సేన్ వైపే చూపిస్తున్నాయి. అయితే… ఈ గొడవ మరువక ముందే…మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్‌.

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ధమ్కి’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా పోస్టర్ ని విశ్వక్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “నో అలెర్ట్ ఓన్లీ ధమ్కి” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news