టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్రపంచ సుందరి.. హీరో ఎవరంటే..?

-

తాజాగా ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న మానుషి చిల్లర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు సమాచారం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఈమె జతకట్టనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న సినిమాలో ఈమె హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ కు జోడిగా ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ ఉండగా ఇందులో జెట్ పైలెట్గా వరుణ్ తేజ్ మనకు కనిపించబోతున్నారు. ప్రస్తుతం పృధ్విరాజ్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మానుషి ఇప్పుడు టాలీవుడ్ లోకి వరుణ్ తేజ్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇక మానుషి చిల్లర్ విషయానికి వస్తే.. పృథ్వీరాజ్ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో ఈమె చాలా బాగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. 2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్డ్ టైటిల్ కూడా ఈమె సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news