బండి సంజయ్, ఆర్ ప్రవీణ్ కు వైట్ ఛాలెంజ్ విసిరిన విశ్వేశ్వర్ రెడ్డీ

-

రేవంత్‌ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్…. స్వీకరించి గన్‌ పార్క్‌ కు చేరుకున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ఆదర్శం గా ఉంటుందని… కేటీఆర్ కూడా ముందుకు వస్తే అయన స్థాయి పెరిగేదని వెల్లడించారు. రాజకీయ నాయకుడు స్థాయి గురించి మాట్లాడితే .. అయన పతనం మొదలైనట్టేనని చురకలు అంటించారు.

” ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన సవాల్ ను… నీ స్థాయి..నా స్థాయి అని అనడం అంటేనే కేటీఆర్‌ పతనం మొదలైనట్టు ” అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. అమెరికా లో ఉండే కొకైన్ అమ్మకాలు తెలంగాణ లో విపరీతంగా పెరిగాయన్నారు విశ్వేశ్వర రెడ్డీ. ఎన్నికల అఫిడవిట్ లో కేసులు ఉన్నాయో.. లేవో ఇస్తామని… ఈ సారి ఎన్నికల్లో డ్రగ్స్ అలవాటు ఉందా.. లేదా అనే ఆప్షన్ పెట్టాలని ఎద్దవా చేశారు. ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు… బండి సంజయ్, rs ప్రవీణ్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news