charanjit singh channi: రాజ‌కీయ సంక్షోభానికి తెర‌..! పంజాబ్ సీఎంగా చ‌న్నీ ప్ర‌మాణ స్వీకారం

-

charanjit singh channi: పంజాబ్ లో ఏర్ప‌డిన‌ రాజ‌కీయ క‌ల్లోలానికి నేటీతో తెర‌పడింది. అనూష్యంగా పంజాబ్ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్ రాజీనామా చేయ‌డంతో రాజ‌కీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ కాంగ్రెస్ చరంజీత్​​ సింగ్​ చన్నీ​ని ముఖ్యమంత్రి గా నామినేట్ చేసింది. దీంతో నేడు పంజాబ్‌ నూతన సీఎంగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు.

చన్నీతోపాటు కాంగ్రెస్ నేతలు సుఖ్​జీం​దర్ ఎస్ రాంధవా, ఓపీ సోని డిప్యూటీ సీఎం లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ప్రమాణస్వీకారానికి ముందు సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ కుటుంబసభ్యులతో కలసి చరణ్‌జీత్‌ గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సీఎంకు పలువురు ఘనస్వాగతం పలికారు.

అయితే… తొలుత సీఎం రేసులో పీసీపీ చీఫ్​ నవ్యజోత్​ సింగ్​ సిద్దూ ముందున్నా.. ఆయ‌న‌కు కెప్టెన్​ అమరీందర్​ సింగ్ విభేదాలు ఉండ‌టం. ప‌లు వివాద‌స్ప‌వ్యాఖ్య‌లు చేయ‌డంతో కాంగ్రెస్ అధిష్టానం చన్నీ వైపు మొగ్గు చూపిన‌ట్టు రాజ‌కీయ విశ్లేషకులు చెపుతున్నారు. మ‌రోవిష‌య‌మేమిటంటే.. పంజాబ్‌లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో క‌ల్లోలాలు రావ‌డం ప‌లు అనుమానాల‌కు దారి తీసుంది.

చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2015 నుంచి 2016 వరకు పంజాబ్ విధాన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చరణ్​జీత్​​​ సింగ్​​ రామదాసియా సిక్కు వర్గానికి చెందిన దళిత వ్యక్తి.

Read more RELATED
Recommended to you

Latest news