వివో మంచి స్పీడ్ మీద ఉంది.. ఫోన్ మీద ఫోన్ వరుసగా లాంచ్ చేస్తూనే ఉంది. తాజాగా వివో ఎక్స్80 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ చెక్ రిపబ్లిక్‌లో లాంచ్ అయింది. అయితే ఇది బడ్జెట్ ఫోన్ కాదు.. లగ్జరీ ఫోన్..మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇంకా ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
వివో ఎక్స్80 లైట్ 5జీ ధర..
ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
9,999 చెక్ కొరునాలుగా అంటే మనదేశ కరెన్సీలో రూ.32,100గా నిర్ణయించారు.
డైమండ్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వివో ఎక్స్80 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
6.44 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+ కాగా, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్‌లను ఇందులో అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ కోసం అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే…
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.