వందల సంఖ్యలో ఆ ఇంటిపై వాలుతున్న పక్షులు…!

-

విశాఖలో ఆ ఇంటికి రోజూ వందల సంఖ్యలో అతిథులు వస్తుంటారు. వచ్చిన వారికి కడుపు నిండా తిండి పెడతారు ఆ ఇంటి యజమాని. ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా పదిహేను ఏళ్లుగా చేస్తున్నారు. ఎంత మంది అతిథులు వచ్చినా లేదనకుండా పెట్టడం వారికి అలవాటు. అసలు…ఒకే ఇంటికి ఇంత మంది అతిథులు ఏళ్ల తరబడి రావటానికి కారణం ఏంటి?

విశాఖలో లక్ష్మీనారాయణ రెడ్డికి పక్షి ప్రేమికుడుగా మంచి పేరుంది. పదిహేనేళ్లుగా ఆయన కుటుంబం నిత్యం పావురాలు.. రామ చిలుకలకు ఆహారం అందిస్తూ వస్తోంది. ఉదయం..మధ్యాహ్నం..సాయంత్రం కొన్ని వందల రామ చిలుకలు లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటిపై వాలిపోతాయి. మూడు పూటలా వాటికి గింజలు చల్లుతుంటారు. కుటుంబ సభ్యుల ఆహార వేళలు మారినా..పక్షులకు గింజలు వేసే విషయంలో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు.

వందలాది పక్షులు ఏళ్ల తరబడి లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటి సభ్యులుగా మారిపోయాయి. ఆయన కుటుంబం మొత్తం వీటికి ఆహారం అందిస్తూ అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తుంటుంది. క్రమం తప్పకుండా వచ్చే రామ చిలుకలు..పావురాలను చూసేందుకు చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండే వారు బిల్డింగులపైకి చేరుతుంటారు. వారికి పక్షుల పలకరింపులు లేనిదే సూర్యోదయం..సూర్యాస్తమయాలు ఉండవు. స్థానికులకు పక్షుల రాకపోకలే సమయం గుర్తు చేస్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news