గంటా శ్రీనివాస్ మెడ‌కు భూకుంభ‌కోణం ఉచ్చు..!

-

విశాఖ భూకుంభకోణం అంశం.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మెడ‌కు చుట్టుకుంటోంది. టీడీపీ ప్ర‌భు త్వం ముగించింద‌నుకున్న కేసును , మ‌ళ్లీ వైసీపీ ప్ర‌భుత్వం తిర‌గ‌తోడుతుండ‌టంతో, గ‌తంలో ఆరో ప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. టీడీపీ హయాంలో వేల ఎకరాల విశాఖ భూకుంభకోణం అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచల‌నం సృష్టిం చింది. అయితే ఈ కుంభకోణంపై పునర్ విచారణ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రెడీ అవుతోంది. మొత్తం ఈ కుంభ‌కోణంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేగాక విచార‌ణ‌ర‌కు కొత్త‌గా సిట్ ను రంగంలోకి దింపేందుకు స‌మాయ‌త్తం అవుతోంది.

టీడీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వి నిపించింది. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేల‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఈ భూ కుంభకోణంపై నాటి మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా గంటా శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వేల ఎకరాలకు సంబంధించిన కుంభకోణం కావడంతో సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీతో పాటు మిగిలిన విపక్షాలు అప్ప‌ట్లో డిమాండ్ చేశాయి.

Vizag land scam Ganta srinivasa rao
Vizag land scam Ganta srinivasa rao

చంద్రబాబు మాత్రం సిట్ ఏర్పాటు చేసి, చేతులు దులుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కుంభకోణం జరిగింద‌ని విప‌క్షాల‌న్నీ ఆరోపించినా, ఆయ‌న మాత్రం కేవలం రెండు మండలాలకు మాత్రమే సిట్ విచారణను పరిమితం చేశారు. 2014లో సంభవించిన హుద్‌హూద్‌ తుపానులో రికార్డులు కొ ట్టుకుపోయాయంటూ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. చివరకు వేల ఎకరాల కుంభకోణాన్ని… మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్‌ అయినట్లు ‘సిట్‌’ అధికారులు ప్రకటించి ముగించేశారు.

అయితే ఆ నివేదికను నాటి కేబినెట్ ఆమోదించి, వివరాలు బయటకు పొక్క‌కుండా జాగ్ర‌త్త‌లు తీ సుకుంది. కాగా ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డంతో ప్రభుత్వం మారిన నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణంపై తిరిగి విచారణ జరిపించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈనేప‌థ్యంలో మాజీ మంత్రి గంటా కూడా రెండు రోజుల క్రితం సీఎం జగన్‌కు లేఖ కూడా రాశారు. తనపై ఆరోపణలు అవాస్తవమని… మళ్లీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత సిట్‌ నివేదికలో ఏముందో కూడా తనకు తె లియదని ఆయ‌న పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వం పునర్‌ విచారణకు ఆదేశించింది. త్వరలోనే సిట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news