ఇప్పుడున్న కాలంలో సమాజంలో తక్కువ వయసులో ప్రేమపై సరైన అవగాహన లేక ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఆ ప్రేమను గెలించుకునే ప్రయత్నంలో ఓడిపోయి చనిపోవడం.. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా మనకు నిత్యం దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లో ఇద్దరు ప్రేమికులు లాడ్జి లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడానికి సిద్ధం అయ్యి అచ్యుతాపురంలో లాడ్జి తీసుకున్నారు. అనంతరం కత్తితో మణికట్టు వద్ద కట్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా లక్కీ గా పనివారు రూమ్ కి వెళ్లడంతో విషయం గమనించి, వెంటనే అబ్బాయిని హాస్పిటల్ కు తరలించారు. కాగా రూమ్ లోనే అమ్మాయి చనిపోయింది.
Home వార్తలు Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్ బలవన్మరణానికి పాల్పడ్డ లవర్స్… కత్తితో కోసుకుని ఆత్మహత్య !