ప్రస్తుతం తెలంగాణాలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోనున్నారని ప్రముఖ యువ జ్యోతిష్యుడు అయిన రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ముందుకు తీసుకువస్తూ ఎందరికో స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రము నిలుస్తోంది. సమీపంలో తెలంగాణాలో ఎన్నికలు ఉండడంతో ఈ ట్వీట్ ఇప్పుడు BRS కు మరింత ఊపిరిని ఇస్తుందని చెప్పాలి. ఈయన చేసిన ట్వీట్ లో నమో రుద్రాయ… త్వరలో జరగబోయే ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ విజయాన్ని సాధించి మళ్ళీ కేసీఆర్ సీఎంగా కానున్నారు అంటూ ట్వీట్ చేశారు.
ఈ యువ జ్యోతిష్యుడు ను ఫాలో అయ్యే వారిలో ప్రధాని మోదీ మరియు ఇంకా కొందరు దేశవ్యాప్తంగా ఇతనిని ఫాలో అవుతుండడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మరి ఈ జ్యోతిష్యుడు మాటలు నిజం అయ్యి… మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే ఇక తెలంగాణలోనూ మరే ఇతర రాజకీయ పార్టీలు సర్దుకోవాల్సిందే.