VT13 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్

-

వరుస హిట్లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథను ఎంపిక చేసుకుంటున్న వరుణ్ తేజ్… ఇటీవల గని సినిమా చేసిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అయితే.. ఈ సినిమా బాంక్స్‌ ఆఫీసు ముందు బొక్కా బోర్లా పడింది.

ఇక తాజాగా వరుణ్‌ తేజ్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ ను అనౌన్స్‌ చేశాడు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా పిక్చర్స్‌ ఆధ్వర్యంలోనే తన 13 వ సినిమా కు సంబంధించిన పోస్టర్‌ ను రివీల్‌ చేశారు వరుణ్‌ తేజ. ఈ మేరకు తన పోస్టర్‌ ను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశాడు ఈ మెగా హీరో. ఇందులో వరుణ్‌ తేజ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిగా కనిపించనున్నాడని.. పోస్టర్‌ చూస్తే మనకు అర్ధమౌవుతోంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలోని పాత్రలను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news