హైద‌రాబాద్ : టిప్పు ఇవ్వలేద‌ని చిత‌క‌బాదిన వెయిట‌ర్..!

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్ట్ బావ‌ర్చీ హోటల్ లో బిర్యాని తినేందుకు వచ్చిన స్థానిక యువకులపై వెయిటర్ దాడికి పాల్పడ్డారు. టిప్పు విషయంలో యువకులపై దాడికి వెయిటర్ దాడికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. బిర్యానీ తిన్న తర్వాత బిల్ చెల్లించి వెళ్తున్న యువకులను నాకు టిప్పు ఇవ్వరా అని చెప్పి యువకులు వెయిటర్ తెలుస్తొంది. హోటల్ యజమాన్యం కూడా యువకుల పై దాడికి యత్నించిన‌ట్టు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.

గతంలో కూడా ఈ హోటళ్లపై పలు రకాల ఆరోపణలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఎయిర్ పోర్ట్ బావ‌ర్చి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు వెయిట‌ర్ పై యువ‌కుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న పై విచార‌ణ జ‌రుపుతున్నారు. టిప్పు ఇవ్వ‌నందుకే త‌మ‌పై వెయిట‌ర్ దాడి చేశాడ‌ని ఆరోపిస్తున్నారు.