ఇండియాలో తగ్గిన కోవిడ్ కేసులు.. 24 గంటల్లో 6984 కేసులు నమోదు.

ఇండియాలో కరోనా రోజూ వారీ కేసులు రోజు రోజుకు తగ్గతున్నాయి. ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వేగవంత చేయడంతో కరోనా సోకే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. యూరోపియన్ దేశాల్లో రోజుకు 40 వేల కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నా ఇండియాలో రోజుకు 10 వేల కన్నా తక్కువ కరోనా కేసులు.. మరణాలు నమోదవుతున్నాయి.

తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో 6984 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 247 మంది కరోనా బారిన పడి మరణించారు. 8,168 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉండగా… రికవరీ రేటు 98.38 శాతంగా, మరణాల రేటు 1.3గా ఉంది.

దేశంలో కరోనా వివరాలు

యాక్టివ్ కేసులు: 87,562
మొత్తం రికవరీలు: 3,41,46,931
మరణాల సంఖ్య: 4,76,135

మొత్తం టీకా: 1,34,61,14,483 డోసులు