Waltari Veerayya : చిరు నోట మరోసారి జంబలకిడి జారు మిఠాయి పాట

-

జంబలకిడి జారు మిఠాయా కొద్ది నెలల క్రితం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్.. ట్రోల్స్ చూసిన డైరెక్టర్ బాబీ.. మెగాస్టార్ చిరంజీవితో తాను తీసిన మూవీ వాల్తేరు వీరయ్యలో ఒక బిట్ పెట్టారు.  నేను లుంగీ కడతా సూడు.. నే లుంగీ కట్టా సూడు. నా లుంగీ సైడు సూడకపోతే ఇప్పేస్తాను సూడు.. జంబలకిడి జారు మిఠాయా అంటూ తనదైన మాస్ కామెడీ స్టైల్లో పాడారు చిరు. ఇక ఈ సన్నివేశం వస్తున్నప్పుడు థియేటర్లలో అరుపులు, కేకలతో రచ్చ చేశారు ఫ్యాన్స్.

ఈ చిత్రానికి కేవలం ఇండియాలో కాదు.. యూఎస్ లో కూడా సూపర్ క్రేజ్ వస్తోంది. అమెరికాలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం మెగాస్టార్ చిరంజీవితో కలిసి యూఎస్ ఫ్యాన్స్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో నార్త్ అమెరికాకు సంబంధించి 20కి పైగా రాష్ట్రాల చిరంజీవి అభిమానులు వర్చువల్ గా పాల్గొననున్నారు. వారితో చిరంజీవి వర్చువల్ గా మాట్లాడి సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ప్రోమోలో చిరంజీవి తన యూఎస్ ఫ్యాన్స్ తో మాట్లాడారు. అలాగే నేను షర్ట్ ఏస్తా చూడూ.. నేను షర్ట్ ఏస్తా చూడూ.. నువ్వు సూడకుంటే నేను ఇప్పేస్తా సూడు జంబలికిడి జారు మిఠాయా అంటూ యూఎస్ ఫ్యాన్ తో కలిసి పాట పాడారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news