మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎంతున్నాయో తెలుసుకోవాలా..? అయితే మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అలానే కస్టమర్స్ కి ఈజీగా వుండేలా కొన్ని మార్పులని కూడా చేసింది. మీరు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే పలు సేవలని ఎంతో ఈజీగా పొందొచ్చు. అలానే బ్యాలెన్స్ ని కూడా తక్కువ సమయంలోనే తెలుసుకోచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవాలంటే కొన్ని రకాల ఆప్షన్స్ వున్నాయి. వీటితో మీరు చాలా ఈజీగా క్షణాల్లో బ్యాలెన్స్ ని తెలుసుకోచ్చు. దీని కోసం మీరు బీఏఎల్ అని టైప్ చేసి 09223766666 నెంబర్‌కు మెసేజ్ పంపిస్తే చాలు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. అదే ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే ఆర్‌ఈజీ అకౌంట్ నెంబర్ టైప్ చేసి 09223488888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు మిస్డ్ కాల్ ద్వారా కూడా మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లేదు అంటే 09223866666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. బ్యాంక్ మీకు మిని స్టేట్‌మెంట్ పంపిస్తుంది. బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏటీఎం సెంటర్‌కు వెళ్లి కూడా డెబిట్ కార్డు సాయంతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈజీగా బ్యాలెన్స్ చెక్ చేసుకోచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ ఎంత ఉందో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news