వాట్సాప్ కాల్ రికార్డింగ్ చెయ్యాలనుకుంటున్నారా..? అయితే ఈ వివరాలు మీకోసమే..!

-

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా వాట్సాప్ ఉంటుంది. ఈ యాప్ అత్యంత ప్రజాదరణ కలిగిన యాప్. రోజువారీ అవసరాలకు చాటింగ్ చేయడానికి ఈ యాప్ బాగా సహాయపడుతుంది. అయితే కొంతమంది కొన్ని ఫీచర్లు తెలియక ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా మనం ఫోన్ నుంచి ఎవరికైనా ఫోన్ చేస్తే కాల్ రికార్డింగ్ చేసుకోవడానికి అవుతుంది. అయితే మరి వాట్సాప్ లో కూడా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు.

వాట్సాప్ కాల్ ని ఎలా రికార్డ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం మామూలు కాల్ చేసినప్పుడు సులభంగా రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. జస్ట్ రికార్డు పైన క్లిక్ చేస్తే చాలు కాల్ రికార్డింగ్ అయిపోతుంది. అదే విధంగా అంతే ఈజీగా వాట్సాప్ కాల్ రికార్డింగ్ కూడా చేసేయచ్చు. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లో థర్డ్ పార్టీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్యూబ్ కాల్ రికార్డర్ వంటి యాప్ ని ఏదైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వారికి కాల్ చేయండి. ఇక్కడ కాల్ రికార్డింగ్ కనబడుతుంది అంటే మీ కాల్ రికార్డు అవుతుంది అని అర్థం.

iOS ఫోన్ల విషయానికి వస్తే, ఈ ఫోన్లలో వాట్సాప్ కాల్ రికార్డింగ్ కోసం మీ వద్ద Mac సిస్టమ్ మరియు ఐఫోన్ కూడా ఉండాలి. ఈ పద్దతిలో మీ iPhone ను Mac బుక్ కు కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి. క్విక్ టైం అప్షన్ లోకి వెళ్ళి న్యూ ఆడియో రికార్డింగ్ ను సెలెక్ట్ చెయ్యాలి. క్విక్‌టైమ్‌లోని రికార్డ్ బటన్ పక్కన, డౌన్ ఆరో క్లిక్ చేసి ఐఫోన్ ఎంపికను క్లిక్ చేసి ఐఫోన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. క్విక్ టైం లోని రికార్డ్ నొక్కండి.

Read more RELATED
Recommended to you

Latest news