వార్ అండ్ పీస్ : ఏంటీ? కేసీఆర్ కు అంత సీన్ ఉందా?

-

కొన్ని మార్పులు కోరుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి
అందుకు త‌గ్గ ఆచ‌ర‌ణ ఉంటే అనుకున్న‌వ‌న్నీ సిద్ధిస్తాయి
కేసీఆర్ చేయానుకుంటున్న‌ది ఇదే !
చేయ‌బోతున్న‌దీ ఇదే! అవును! దేశ రాజ‌కీయాల్లో
కొన్ని మార్పుల‌కు తానెందుకు కార‌ణం కాకూడ‌దు అన్న
తలంపు నుంచి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.
అవి ఫ‌లిస్తాయా లేదా అన్న అస్స‌లు చ‌ర్చించాల్సిన ప‌నే లేని విష‌యం

లే లే త‌గ్గేదేలే అని అంటున్నారు కేసీఆర్.. ఏ బిడ్డా ఇది నా అడ్డా అని కూడా అంటున్నారు. స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్ర‌వ‌ర్తిస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాల‌ని మండిప‌డుతున్నారు.ప‌న్నుల రూపంలో కేంద్రానికి తాము అధిక ఆదాయాన్ని ఏటా ఇస్తున్నా ద‌క్షిణాదిపై వివ‌క్ష మాత్రం అలానే ఉంటుంద‌ని ఆయ‌న ఫైర్ అవుతున్నారు.

ఈ ద‌శ‌లో ఆయ‌న దేశ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని భావిస్తున్నాన‌ని, ముఖ్యంగా రాజ్యాంగంలో మార్పులు రావాల్సిందేన‌ని చెబుతున్నారు. నేను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో కానీ ముందు కొన్ని మార్పుల కోసం మాత్రం అధ్య‌య‌నం చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.కేంద్రం ఏకప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో న‌ష్ట‌పోతున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు.

కొత్త యుద్ధం ఒక‌టి చేయాల‌ని అనుకుంటున్నారు కేసీఆర్.అందుకు అనుగుణంగా త‌న‌ని తాను సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్.ఎవ‌రు ఏమ‌నుకున్నా ఐ డోంట్ కేర్ అన్న విధంగా ఉండే కేసీఆర్ త‌న పంథాను మార్చ‌నున్నారు.త‌న రాజ‌కీయ జీవితంలో కొత్త ఉద‌యం తీసుకుని రావాల‌ని, త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో కొత్త మ‌లుపు తీసుకొని రావాల‌ని ప‌రిత‌పిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశ రాజ‌కీయాల‌పై దృష్టి సారిస్తున్నారు.ఇన్నేళ్ల కాల వ్య‌వ‌ధిలో వ్య‌వ‌స్థ‌ల్లో వ‌చ్చిన మార్పులు,రావాల్సిన మార్పులు, చేయాల్సిన చేర్పులూ ఇలా అన్నింటిపై ఆయ‌న మాట్లాడ‌నున్నారు.

ముఖ్యంగా నీటి వినియోగం, సంబంధిత ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ వీటిపైనే ఆయ‌న ఎక్కువ‌గా మాట్లాడుతున్నారు.వివిధ సంద‌ర్భాల్లో కేంద్రాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. న‌దుల అనుసంధానంపై బ‌డ్జెట్ లో నిర్మలా సీతారామ‌న్ ప్ర‌సంగం చేయ‌గానే వెంట‌నే కేసీఆర్ స్పందించి,త‌న‌దైన వాద‌న వినిపించారు.ఇప్ప‌టిదాకా ఉన్న జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌లేని కేంద్రం, న‌దుల అనుసంధానం ఎలా చేస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news