తెలంగాణాలో పోలీసులు వర్సెస్ మావోయిస్ట్ లుగా పరిస్థితి మారింది. ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో అని తెలంగాణా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూటకపు ఎన్ కౌంటర్ లకు నిరసన గా ఇవ్వాళ మావోయిస్టులు బంద్ పిలుపు నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు… అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మూడు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్ళ గూడెం ఎన్కౌంటర్ లో శంకర్ అనే మావోయిస్టు యాక్షన్ టీం మెంబర్ ని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపారు. దీనితో… శంకర్ ఎన్కౌంటర్ బూటకమంటూ, బూటకపు ఎన్కౌంటర్ లకు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్ కు పిలుపునిచ్చారు. అడవుల్లో నక్సల్స్ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులు… ఏ చిన్న అనుమానం వచ్చినా సరే అప్రమత్తంగా ఉంటున్నారు.