వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల పై..

-

వరంగల్: ఎంజీఎం (MGM) అధికారులు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీనిపై వైద్య అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాందారిపల్లి వాసి రాగుల రమేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని  వైద్యులు తెలిపినట్లు బాధితుల తెలిపారు.

రమేష్ మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీ అధికారులు ఇచ్చిన్నట్లు మృతుడి బంధువులు వాపోతున్నారు. అంత్యక్రియలు చేస్తుండగా గమనించిన బంధువులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ముందు ఆందోళకు దిగారు.ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడిరమేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు లేనిపక్షంలో  నిరసన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news