కెప్టెన్ ని టిక్ టాక్ లోకి లాగిన వార్నర్…!

-

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. అతను ఎప్పుడు ఏదోక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. వారు అందరూ కూడా అతని వీడియో లను పోస్ట్ లను బాగా ఫాలో అవుతూ ఉంటారు. మన దేశంలో కూడా అతనికి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.

David Warner and Aaron Finch

ఇప్పుడు లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్న వార్నర్ ఇటీవల కొన్ని వీడియో లను విడుదల చేస్తున్నాడు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. వార్నర్ ఇప్పుడు తన దేశ వన్డే కెప్టెన్ ఆరోన్ పించ్ కి ఒక ఛాలెంజ్ చేసాడు. టిక్ టాక్ లో వీడియో చెయ్యాలి అని సూచించాడు. దీనితో పించ్ కూడా తన భార్యతో కలిసి ఒక వీడియో చేసి పోస్ట్ చేసాడు. దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా భారీ నష్టాలలో ఉండి తమ ఉద్యోగులను కూడా తొలగించే కార్యక్రమాలు చేస్తుంది. వందల మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. లాక్ డౌన్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు దాదాపుగా 300 మిలియన్ డాలర్లు నష్టపోయింది అని అంచనా. ఇక ఆ దేశంలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news