వినియోగదారుల వ్యక్తిగత డేటాపై గూఢాచార్యం చేసేందుకు స్లైస్ పేమెంట్ యాప్ యత్నిస్తోందని గూగుల్ సంస్థ హెచ్చరిస్తోంది. క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నయమని చెప్పుకునే ఈ యాప్ వినియోగదారుల పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను కలెక్ట్ చేస్తోందని గూగుల్ పేర్కొంది. అయితే వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న టూల్‌ను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ టూల్ గుర్తించింది. ఈ టూల్ స్లైస్ వినియోగదారుల డేటాను దొంగిలించే అవకాశం ఉంది. స్లైస్ పంపిన నోటిఫికేషన్లను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుడిని ప్లే ప్రొటెక్ట్ పేజీకి తీసుకెళ్తుంది.
మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్, కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు ఆస్కారం ఉందని గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు వినియోగదారులు స్లైస్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరింది. అయితే గూగుల్ గుర్తించిన ఈ సమస్యను స్లైస్ 4 గంటల్లో పరిష్కరించిందని సంస్థ పేర్కొంది. వినియోగదారులు తమ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి.. మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాలని తెలిపింది. కొత్త వెర్షన్ 10.0.7.3ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను కోరింది.