భర్తతో షాపింగ్‌కు వెళ్లి.. ప్రియుడితో భార్య జంప్!

-

బీహార్‌లోని ముంగేరీలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భర్త ముందే భార్య మరో యువకుడితో కలిసి పారిపోయింది. పెళ్లైన వారం రోజులకే భార్య తన భర్తకు పెద్ద షాక్ ఇచ్చింది. గాజులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన నూతన వధువరుల దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. దీంతో భార్య తన భర్త చేయి విడిచిపెట్టి ప్రియుడి కారు ఎక్కి వెళ్లిపోయింది. ఈ మేరకు భర్త కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివాహితను పట్టుకున్నారు.

ప్రియుడితో భార్య జంప్
ప్రియుడితో భార్య జంప్

ముంగేరీకి చెందిన మోని కుమారికి బీకాపూర్ సంతోషిమాత గల్లిలో నివసించే వివేక్ కుమార్‌తో జూన్ 14వ తేదీన వివాహం జరిగింది. జూన్ 18వ తేదీన పుట్టింటికి వెళ్లిన మోని కుమారి జూన్ 21వ తేదీన ఇంటికి వచ్చింది. జూన్ 22వ తేదీన వివేక్ కుమార్‌తో కలిసి గాజులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లింది. దీన్‌దయాళ్ చౌక్ దగ్గర మోని కుమారి.. భర్త వివేక్ చేయి వదిలేసి ప్రేమికుడు దివ్యాంశుతో కలిసి కారులో ఎక్కి పారిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేశారు. కాగా, దివ్యాంశు-మోని కుమారి 2016 నుంచి ప్రేమించుకున్నట్లు.. 2020 సెప్టెంబర్ 5వ తేదీన వీరికి వివాహం జరిగినట్లు వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news