గేట్స్ ఫౌండేషన్ నుండి వైదొలగిన వారెన్ బఫెట్

ప్రపంచ కుబేరుడిగా ఎన్నో సార్లు నిలిచిన బెర్క్ షైర్ హాథ్ వే అధినేత వారెన్ బఫెట్, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుండి వైదొలిగాడు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, తన భార్య మిలిందా గేట్స్ కలిసి, బిల్ అండ్ మిలిందా గేట్స్ పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ లో బఫెట్ కూడా భాగస్వామిగా ఉంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఫౌండేషన్లో క్రియాశీలకంగా లేనందువల్లే రాజీనామా చేస్తున్నానని బఫెట్ ప్రకటించాడు.

ఇప్పటి వరకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ కి 28బిలియన్ డాలర్లని ఖర్చు చేసాడు. బఫెట్ రాజీనామా విషయ్ంలో స్పందించిన ఫౌండేషన్ సీఈవో మార్క్ సుజ్ మాన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బఫెట్ అందిన సేవలు మరువలేనివని, ఆయన చూపిన మార్గం ఆదర్శమని అన్నాడు. ఇంకా బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కూడా ఈ విషయంలో తమ స్పందన తెలిపారు. 27ఏళ్ళుగా భార్యాభర్తలుగా ఉన్న బిల్ ఇంకా మిలిందా తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించారు.