కాశ్మీర్ పై అన్ని పార్టీల నాయకులతో ప్రధాని సమావేశం… ఏం మాట్లాడనున్నారంటే,

2019లో కాశ్మీర్ కి రాష్ట్ర హోదాని తీసివేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రభుత్వం కాశ్మీర్ ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ విషయమై కాశ్మీర్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని గురించి ప్రధాని సమావేశం నిర్వహించనున్నారు. అన్ని పార్టీల నాయకులతో కలిసి ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, నాయకులు హాజరు కానున్నారు. ఈ మేరకు వీరంతా బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.

14మంది నాయకులతో ఈ సమావేశం మొదలు కానుంది. జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇవ్వాలని, అలాగే ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని వీరంతా కోరుకుంటున్నారు. కాకపోతే ఇటు ప్రభుత్వం మాత్రం ఆర్టికల్ 370రద్దు విషయంలో వెనక్కి తగ్గేలా లేదు. ఈ రోజు మధ్యాహ్నాం 3గంటలకు మొదలయ్యే సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.