బ్రేకింగ్‌ : టీమిండియా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా.. సౌతాఫ్రికా సిరిస్ కు దూరం

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు పైగా కరోనా మహమ్మారి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక అటు దేశంలోని ప్రముఖులు, సెలబ్రీటీలు, సినీ తారలు కరోనా బారీన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే… తాజాగా టీమిండియా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. తానను ఈ మధ్య కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలిన కోరారు. ఇక క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా సోకడంతో.. సౌతాఫ్రికా జట్టుతో జరిగే… వన్డే సిరీస్‌ కు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇక వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో మరొకరికి చాన్స్‌ దక్కనుంది.కాగా.. ఇవాళ్టి నుంచి సౌతాప్రికా వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య మూడో టెస్ట్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.