గత రెండు పర్యాయాలుగా భారతదేశాన్ని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి పాలిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి వ్యతిరేక పవనాలు వీచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీని ఓడించడానికి ఇండియా అనే పేరుతో మరో కూటమి ఏర్పడడంతో మోదీకి వీరిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడం పెనుసవాలుగా మారనుంది. రేపు ఇండియా కూటమి ముంబై లో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో చాలా కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకోనున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఈ మీటింగ్ గురించి కీలక మెసేజ్ చేసింది. వచ్చే సంవత్సరం దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ గెలిచి మళ్ళీ మోదీనే పీఎం అవుతారంటూ మెసేజ్ చేశారు. విపక్షాలు ఎన్ని కలలు కన్నా అంతిమంగా విజయం మాత్రం బీజేపీదే అంటూ చెప్పారు.
మరి ఎన్నికల సమరంలో తుది విజయం ఎవరిది కానున్నది అన్నది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.