దాదాపు 40వేల మందికి ఉద్యోగాలు కల్పించాం : మంత్రి శ్రీధర్ బాబు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేసి ప్రజల మన్ననలు పొందుతుంది. మరో వైపు రైతు బీమా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. రుణ మాఫీ ఇప్పటికే రెండు దశల్లో విడుదల చేశారు. ఆగస్టు 15 లోపు మూడో దశలో రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ కానున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడారు.

దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన భాగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అనేక మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతూనే ఉన్నాయి.  ఇప్పటికీ దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది అని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news