భారత్ మీద ప్రపంచం ఆధార పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మన దేశంలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. వర్షాకాలం వచ్చింది అంటే దోమలు స్వైర విహారం చేయడం తో నిత్యం కోట్ల మందికి మలేరియా వైరస్ సోకుతుంది. దీనితో మన దేశంలో దాని నివారణకు, చికిత్సకు ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి.
మలేరియా ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దానిని ఎదుర్కోవడానికి గానూ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను మన దేశంలో భారీగా తయారు చేస్తారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌పై ఈ మందు ప్రభావవంతంగా పనిచేస్తోందని భావించిన అమెరికా అధ్యక్షుడు దాని కోసం మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీనితో ప్రధాని నరేంద్ర మోడీ దానిని ఎగుమతి చేయడానికి రెడీ అయ్యారు.
చాలా మందికి మన దేశంలో ఆ మందు కొరత ఉంది కదా అనే అనుమానం ఉంది. కాని అది నిజం కాదని లెక్కలు చెప్తున్నాయి. 7 కోట్ల మంది చికిత్సకు 10 కోట్ల ట్యాబ్లెట్లు సరిపోతాయి. ఏప్రిల్, మే నెలల్లో 110 టన్నుల మందులను తయారు చేస్తారు. మనకు కావాల్సింది కేవలం 10 తన్నులు. మిగతా మందులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. 100 టన్నులు విదేశాలకు వెళ్తాయి.
100 టన్నులంటే దాదాపు 50 కోట్ల ట్యాబ్లెట్లు. అమెరికాకు మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో నెల రోజుల పాటు వాటిని మన ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేస్తే ప్రపంచ దేశాలకు ఇవ్వొచ్చు. ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, పాకిస్తాన్ కు మనం ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మందు వాడిన వంద మందిలో ఒకరికి గుండెపోటు వస్తున్నట్టు పరిశోధనల్లో వెల్లడి అయింది. ఇది చాలా చవక కూడా.