త్వరలో పరిపాలన రాజధాని శంకుస్థాపన : బొత్స

-

జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు సహా రద్దుకు సంబంధించిన బిల్లుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆమోదం జగన్ సర్కార్ కు బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని ప్రభుత్వ ఉద్దేశం అంటూ వ్యాఖ్యానించారు. పరిపాలన రాజధానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో శంకుస్థాపన చేశారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

విశాఖపట్నం రాష్ట్ర పరిపాలన రాజధానిగా ఏర్పాటు అయిన తర్వాత శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అంటూ మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ఢిల్లీ ముంబై లతో పోటీ పడేలా విశాఖ రాజధాని అభివృద్ధి చేస్తామంటూ తెలిపిన బొత్స సత్యనారాయణ.. విశాఖ లో ఉన్న ప్రభుత్వ భూములను ఎక్కువగా రాజధాని నిర్మాణం కోసం వాడుకుంటాము అంటూ స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్రంలో అంతర్భాగం అంటూ తెలిపిన బొత్స.. ఆ ప్రాంతాన్ని సకల హంగులతో మేటి ప్రాంతంగా తీర్చి దిద్దాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news