జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానులు కు సంబంధించిన బిల్లు సహా సీఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లులను ఇటీవలే ఏపీ గవర్నర్ ఆమోదం తెలపడం తో ఆంధ్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఇక గవర్నర్ 3 రాజధానుల కు ఆమోదం తెలపడంతో ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక తాజాగా దీనిపై స్పందించిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు.

chandrababu

అమరావతి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని మడమతిప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చరిత్రలో ఎక్కడా కూడా ఒక రాష్ట్రంలో మూడు రాజధానులు లేవని తెలిపిన చంద్రబాబు నాయుడు… అమరావతి ఆంధ్ర ప్రజల కల అంటూ వ్యాఖ్యానించారు. భూమిని రైతులు రాజధాని కోసం త్యాగం చేశారని… కానీ ప్రస్తుతం జగన్ సర్కార్ గత మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అంటూ విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు.