ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. గిరిజన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులతో ఆమె తాజాగా చర్చలు జరిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి.. వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు.
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందని విమర్శించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క రోజూ ఉద్యోగుల సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు.