ఏపీలో ఉచిత ఇసుక విధానం.. ఎప్పటి నుంచి అంటే..?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. కాగా.. ఇంతకుముందు ఉచిత ఇసుక విధానాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ విధానాల వల్ల భవన నిర్మాణ రంగం దారుణంగా నష్టపోయిందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో.. ఇసుక కొరత ఏర్పడిందని సీఎంకు నిన్న జరిగిన సమీక్షలో తెలిపారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనులు దొరక్క కూలీలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మత్తులపై ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు. నిన్నటి సమీక్ష తర్వాత కొత్త ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావించారు. ఇవాల ప్రకటించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news