33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం – హరీష్ రావు

-

నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2000 పడకల ఆసుపత్రి అతి వేగంగా నిర్మాణం జరుగుతుందన్నారు. దసరా వరకూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

మార్చ్ కల్ల 14 లక్షల అడుగులు పూర్తి చేస్తామన్నారు. దేశంలో పెద్ద ఆసుపత్రి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు మంత్రి హరీష్ రావు. వరంగల్ లో హెల్త్ యూనిర్సిటీ ఏర్పాటు, మెగా టెక్స్ టైల్ పార్క్ ఎర్పాటు చేస్తున్నామన్నారు. కొత్తగా వస్తున్న రోగులకు, జనాభా సరిపడా వైద్య సదపాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. రెండు పంటలకు నీరు అందిస్తున్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమె అన్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయం త్వరలో పూర్తీ చేస్తామన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళశాలు ఎర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఎంబీబీఎస్, పిజి సీట్లు పెంచడమే లక్ష్యం అని.. పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు సీట్లు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుండి.. పోదామా బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే విధంగా చేశామన్నారు. వివిధ రాష్ట్రాలకి కంటి వెలుగు కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రజల వద్దకు ప్రభుత్యం వెళ్తుందన్నారు. కిడ్నీ, హర్ట్ మార్పిడి సౌకర్యం ఈ హాస్పిటల్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి. దసరాకి అందుబాటులోకి రావాలని ఏజెన్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news