తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం: బండి సంజయ్

-

మరికొన్ని నెలల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి . ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆయా పార్టీలు కసరత్తులను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర జమ్మికుంట మండలం శాయంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

గడచిన పది సంవత్సరాలలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉంది అని తెలిపారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు కాలయాపన చేస్తోంది? సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?’ అని సంజయ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version