రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు, ఈ రోజు మరియు రేపు అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు ఒడిస్సా తీరము లోని వాయువ్య బంగాళాఖతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. ఈ అల్పపీడనం రాగల 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది.
నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుండి 5.8 కి మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట, పెండ్రా రోడ్,, బలంగిర్, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని కారణంగా మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.