బెంగాల్ అసెంబ్లీ అట్టుడికింది. బీర్భూమ్ ఘటనపై రగడ జరిగింది. త్రుణమూల్, బీజేపీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. బెంగాల్ లో ఇటీవల జరిగి బీర్భూమ్ ఘటనపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే ఇరు పార్టీల మధ్య ఘర్షన తలెత్తింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైనా బెంగాల్ లో శాంతి భద్రతల గురించి చర్చించాలని బీజేపీ పట్టుబట్టింది. టీఎంసీ, బీజేపీ ఘర్షణలో టీఎంసీ ఎమ్మెల్యే అసిద్ మజుందార్ కి తీవ్ర గాయాలు కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.. బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ టిక్కా చొక్కా చినిగిపోయింది. ఈ ఘటనతో సువేందు అధికారితో పాటు 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మా ఎమ్మెల్యేలతో గొడివ పడేందుకు టీఎంసీ కోల్ కతా పోలీస్ సిబ్బందిని సివిల్ డ్రెస్ లో తీసుకువచ్చారని బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. టీెఎంసీ ఎమ్మెల్యే అనరుల్ హుస్సెన్ రాంపూర్ హాట్ లో సృష్టించిన గొడవ లాగే టీఎంసీ ఎమ్మెల్యేలు, వారి పోలీసులు అసెంబ్లీలో ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు వ్యతిరేఖంగా ఈరోజు పాదయాత్రం చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం కావాలని ఆయన అన్నారు.