వామ్మో: రోజాను అంత మాట అనేసిన జబర్దస్త్ కమెడియన్..!

-

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్లలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. జబర్దస్త్ షోలో విభిన్న గెటప్స్ వేస్తూ అందరి మన్ననలు పొందుతున్న గెటప్ శ్రీనుకు అప్పటి జడ్జిలు రోజా , నాగబాబు అంటే చాలా ఇష్టం.. అలాగే వారికి కూడా గెటప్ శ్రీను అంటే ఎంతో ఇష్టం. సినిమాల్లో కూడా పాత్రలు వేస్తున్న శ్రీను త్వరలో రాజు యాదవ్ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇదిలా ఉండగా గెటప్ శ్రీను ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తోంది.

ఆయన మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన ఈ గెటప్ శ్రీను మెగా కుటుంబానికి విధేయుడుగా పేరు సంపాదించుకున్నాడు. అందుకే మంత్రి రోజా మెగా బ్రదర్స్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై కాస్త వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు గెటప్ శ్రీను..” చిరంజీవి గారి దానగుణం.. సేవాగుణం.. తెరిచిన పుస్తకం లాంటిది… ఆయన ఒక స్ఫూర్తి.. మరి మీకెందుకు కనబడలేదు? రోజా గారు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ..మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు కోల్పోకండి.. మీ నోటి నుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి” అంటూ తన ఫేస్ బుక్లో రాసుకొచ్చారు.

జబర్దస్త్ లో రోజాకు ఇంత సన్నిహితంగా ఉండే గెటప్ శ్రీను ఒక్కసారిగా డైరెక్ట్ గా అంత మాట అనేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై రోజా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news