Telangana : పోలీసు ఫిజికల్ టెస్ట్‌ ఫలితాలు.. 53.7 శాతం మందికి అర్హత

-

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ)/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ) లాంటి శారీరక సామర్థ్య పరీక్షల్లో 53.70 శాతం మంది ఎంపికయ్యారు. మొత్తం 2,07,106 మంది ఈ పరీక్షలకు హాజరుకాగా.. 1,11,209 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో గతనెల 8న ప్రారంభమైన ఈ పరీక్షలు గురువారం నాటితో ముగిశాయి.

ఈ పోటీల్లో అర్హత సాధించిన వారంతా మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు జరిగే తుది రాతపరీక్షలకు హాజరవ్వనున్నారు. 2018-19లో జరిగిన శారీరక సామర్థ్య పరీక్షల్లో 48.52 శాతం మంది అర్హత సాధించగా, ఈసారి అదనంగా 5.18 శాతం మంది ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకమండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శుక్రవారం వెల్లడించింది.

శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా పురుషులకు 1600 మీటర్లు.., మహిళలకు 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలను లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌లకు అనుమతించారు. లాంగ్‌జంప్‌లో 83 శాతం మంది పురుషులు, 80 శాతం మంది మహిళలు అర్హత సాధించారు. షాట్‌పుట్‌లో 91 శాతం మంది పురుషులు.. 96 శాతం మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news